బి.వై.ఎఫ్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలకు రంగం సిద్ధం
కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 6 కోట మండలం కోటలో బహుజన యూత్ ఫోర్స్ బి.వై.ఎఫ్ నాయకులు ఏప్రిల్ 11వ తేదీ జరగబోయే మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకల కార్యచరణ గురించి సమావేశం నిర్వహించారు.బహుజన యూత్ ఫోర్స్ మరియు బహుజన సమాజ్ పార్టీ, మరియు భాంసెఫ్ నాయకులు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల అభ్యున్నతికై అవిశ్రాంతంగా కృషి చేసిన మహనీయులు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ఏప్రిల్ 11వ తేదీ...