కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 5
బహుజన యూత్ ఫోర్స్ (బి.వై.ఎఫ్) గూడూరు నియోజకవర్గం కన్వీనర్ గా గుణపాడు గ్రామానికి చెందిన అంబేద్కర్ యూత్ సేవా సమితి అధ్యక్షులు ఫౌండర్ అంబేద్కరిస్ట్ శ్రీరామ్ శివప్రసాద్ (శంకర్) ఏకగ్రీవంగా ఎన్నిక అయిన సందర్భంగా ఆయన అనుచరులు స్నేహితులు,కుటుంబ సభ్యులు అనేక మంది శివప్రసాద్ నివాసానికి చేరుకొని పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరిస్తూ కేకులు కట్ చేయించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా శివప్రసాద్ స్నేహితులు,అనుచరులు మాట్లాడుతూ శివప్రసాద్ చిన్నతనం నుండే మంచితనం,సేవగుణాన్ని అలమరుచుకొని ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలు పాందారని అన్నారు.తాను పేద కుటుంబంలో పుట్టి ఎన్నో ఒడుదుడుకులను దాటుకొని ఉన్నతమైన చదువులు చదివి, విద్య అనే ఆయుధంతో అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా మనకిచ్చిన హక్కులను పొంది సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ పేద ప్రజలకు సేవా మంచి చేయాలనే దృఢ సంకల్పంతో అంబేద్కర్ యూత్ సేవా సమితి సంస్థను స్థాపించి ఎంతో మంది పేద ప్రజలకు ఆపదల సమయంలో అండగా నిలిచిన వ్యక్తి శ్రీరామ్ శివప్రసాద్ అని కొనియాడుతూ ఇటీవల బహుజన యూత్ ఫోర్స్ సంస్థలో గూడూరు నియోజకవర్గం కన్వీనర్ గా ఏకగ్రీవంగా ఎన్నిక అయిన నేపథ్యంలో శివప్రసాద్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ్ శివప్రసాద్ కుటుంబ సభ్యులు,అనుచరులు,స్నేహితులు, గ్రామస్తులు ఉన్నారు.