swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 1:13 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

మోటుపల్లి కోటయ్య భౌతిక కాయానికి నివాళులు అర్పించిన టీడీపీ నేత జలీల్ అహ్మద్

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 14

కోట మండలం వెంకన్నపాలెం గ్రామం నందు మంగళవారం స్వర్గస్తులైన మోటుపల్లి కోటయ్య భౌతికకాయానికి తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ జలీల్ అహ్మద్,కోకర్ల మధు యాదవ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ కోటయ్య డ్రైవింగ్ వృత్తిలో అందరితో పరిచయాలు పెంచుకొని స్నేహాభావంగా మెలుగుతూ అందరితో కలిసి పోయేవారని,కోటయ్య అకస్మాత్ముక మరణించడం చాలా బాధాకరం అని మంచి కోటయ్య ఆత్మకు శాంతి చేకూరాలని,తమ కుటుంబానికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అధైర్య పడద్దని వారి కుటుంబ సభ్యులకు మనో ధైర్యాన్ని ఇచ్చారు.కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వెంకన్నపాలెం సర్పంచ్ కోకర్ల మధు యాదవ్, మైనార్టీ నాయకులు నౌషద్ భాష, అనిల్ మరియు తదితరులు పాల్గొన్నారు.