కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 2
ఆంధ్ర రాష్ట్ర శాశ్విత రాజధానిగా చట్టబద్ధం చేయడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని టిడిపి నేత జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ అన్నారు.అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా చట్టబద్ధం చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు లోక్ సభ బుధవారం ఆమోదం తెలపగా,గురువారం రాజ్యసభ సైతం ఏకగ్రీవంగా ఆమోదముద్ర వేసింది.ఈ నేపథ్యంలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాలతో టీడీపీ నేత షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో కోటలోని గోపాల్ రెడ్డి విగ్రహం సెంటర్ వద్ద కోట మండలం టీడీపీ నాయకులు బాణసంచా వేడుకలతో కాగడాలతో విజయోత్సవ దీపాలను వెలిగించి అందరికీ స్వీట్లు పంచిపెట్టి ఆనందోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్విత రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయడం రాష్ట్ర చరిత్రలోనే చారిత్రాత్మిక ఘట్టంగా నిలిచిపోతుంది అన్నారు.శాశ్విత రాజధానిగా అమరావతి రావడం ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆకాంక్ష మరియు చారిత్రాత్మక విజయం అని అన్నారు.ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది.అందులో భాగంగా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాడానికి భారీ ప్రాణాళికలు రూపొందిస్తోందన్నారు. లోక్‌సభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా వైసీపీ నాయకుల తీరు సిగ్గుచేటు అన్నారు.వైయస్సార్సీపి నాయకుల అరాచకాలు భరించలేక రాష్ట్ర ప్రజలు 2024 ఎన్నికలలో కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని వైసిపి నాయకుల తీరు మార్చుకోకపోతే 2029 ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనం అవ్వడం ఖాయమన్నారు.శాశ్వత రాజధాని అమరావతిని సాధించడానికి తీవ్ర కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు,మంత్రి నారా లోకేష్ బాబుకు, గూడూరు శాసనసభ్యులు పాశిం సునీల్ కుమార్ కు కోట మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి,వాకా విజయభాస్కర్ రెడ్డి,కొకర్ల మధు యాదవ్,తిరుమల శెట్టి కోటేశ్వరరావు, షేక్ శంషుద్దీన్,దారా సురేష్,తలం శ్రీనివాసులు,నందన్ మోహన్,పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి,నాయబ్,పోలమ్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.