కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 27
కోట మండలం విద్యానగర్ లోని జియో పెట్రోల్ బంకు లో డీజిల్ దందా నడుస్తుంది. గత కొద్ది రోజులుగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందని విద్యానగర్ లోని హెచ్.పి,భారత్, ఇండియన్ జియో పెట్రోల్ బంకులలో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు,కార్లు ట్రాక్టర్లకు డిజిల్ మరియు పెట్రోల్ సరిగా పట్టని పరిస్థితి ఏర్పడింది.అయితే సోమవారం జియో పెట్రోల్ బంకులో తప్ప ఏ బంకులో ఆయిల్ లేని పరిస్థితి.ఇదే అదునుగా తీసుకున్న జియో పెట్రోల్ బంకు నిర్వాహకులు ఏ ప్రైవేట్ వాహనాలకు డీజిల్ పట్టకుండా రొయ్యలు గుంటలకు చిన్న చిన్న వ్యాపార షాపుల యాజమాన్యం కారులలో క్యాన్ లు పెట్టుకొని వస్తున్న వారికి మాత్రమే డీజిల్ నింపి పంపిస్తు క్యాన్లలో బాటిల్లలో పెట్రోల్ డీజిల్ పట్టకూడదు అనే అధికారుల ఆదేశాలను తుంగలో తొక్కి పారేస్తున్నారు.వ్యవసాయానికి అవసరమని రైతులు,బ్రతుకు దెరువు కోసమని ఆటో కార్మికులు డీజిల్ కోసం వస్తే నిర్దాక్షణంగా డీజిల్ లేదని పంపించేస్తున్నారని,కారులలో క్యాన్ లకు ఎలా డీజిల్ పడుతున్నారు మాకేందుకు పట్టడంలేదని భాధిత ప్రజలు పెట్రోల్ బంకు యాజమాన్యంపై మండిపడుతున్నారు.అధికారులు చొరవ తీసుకొని ఆటో కార్మికులు,రైతులకు డీజిల్ అందించేలా చర్యలు తీసుకొని తమ ఆకలి భాదల నుండి కాపాడాలని కోరుతున్నారు.