శ్యామసుందరపురం కాలనీలో పడకేసిన పారిశుధ్యం-ఎక్కడ చెత్త అక్కడే

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 11 కోట మండలం శ్యామసుందర పురం కాలనీలో పారిశుద్ధ్యం తీవ్రంగా పడకేసింది.దీనివల్ల చెత్తాచెదారం, మురుగునీరు పేరుకుపోయి ప్రజలు అంటువ్యాధుల భయంతో జీవిస్తున్నారు. పంచాయతి అధికారులు,నిర్లక్ష్యం,కాలువల పూడిక సరిగ్గా తీయించకపోవడం,పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి దాపురించింది. ఎప్పుడో ఒకసారి డ్రైనేజీ కాలువలను నామమాత్రంగా పైపైనే శుభ్రం చేయడం వలన కాలవల బండల కింద విపరీతంగా మురికి చెత్త చెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తూ దోమలు బెడద ఎక్కువైందని తద్వారా అనారోగ్య సమస్యలకు గురవుతున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీకి...