శ్రీసిటీని సందర్శించిన తైవాన్ వ్యాపార ప్రతినిధుల బృందం – పెట్టుబడి అవకాశాల పరిశీలన

శ్రీసిటీ,స్వర్ణ సాగరం మార్చి 31, 2026: రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల పరిశీలనలో భాగంగా తైవాన్ దేశానికి చెందిన ఐదుగురు వ్యాపార ప్రతినిధుల బృందం మంగళవారం శ్రీసిటీని సందర్శించింది. తైవాన్ నాన్-వోవెన్ ఫాబ్రిక్స్ ఇండస్ట్రీ అసోసియేషన్ (టిఎన్ఎఫ్ఏ) సంస్థ చైర్మన్ షెల్లీ చియన్ నేతృత్వంలో విచ్చేసిన వారికి శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ సాదర స్వాగతం పలికారు.పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా శ్రీసిటీ ప్రత్యేకతలను వివరిస్తూ శ్రీసిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ (బిజినెస్ డెవలప్మెంట్) బోడ్గన్ జార్జ్ సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. శ్రీసిటీ వ్యూహాత్మక...