శ్రీసిటీలో శ్రీవాణి ఉగాది పురస్కారాల వేడుక – పలువురి ప్రముఖులకు పురస్కారాల ప్రదానం
శ్రీసిటీ,స్వర్ణ సాగరం ఏప్రిల్ 18, 2026:తెలుగు ఉగాదిని పురస్కరించుకుని యేటా శ్రీసిటీలో నిర్వహించే ఉగాది పురస్కారాల కార్యక్రమాన్ని శనివారం అత్యంత వేడుకగా నిర్వహించారు. శ్రీసిటీ ఆధ్యాత్మిక సాహిత్య వేదిక శ్రీవాణి ఆధ్వర్యంలో స్థానిక బిజినెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆధ్యాత్మిక, సాహిత్య రంగాలకు చెందిన నలుగురు ప్రముఖులకు ఉగాది పురస్కారాలను అందచేశారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చేతుల మీదుగా ప్రముఖ పద్య నాటక కళాకారులు డాక్టర్ మీగడ రామలింగస్వామి , హరికథా భాగవతార్ డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి...