కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 1
కోట మండలం కోటలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం అమ్మవారికి దేవస్థాన కమిటీ అధ్యక్షులు విశ్వనాథం నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ,వివిధ రకాల అభిషేకాలతో పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లలిత సహస్రనామ పారాయణం వాసవి స్తుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.తదుపరి అమ్మవారికి పల్లకిసేవ నిర్వహించి
మంగళ హారతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.అనంతరం దేవస్థాన సమన్వయకర్త బోగనాదం విజయభాస్కర్ సతీమణి రమాదేవి సోమవారం పదవి విరమణ పొందిన సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దేవస్థాన పాలకవర్గం ఆధ్వర్యంలో విజయ భాస్కర్ రమాదేవి దంపతులకు శాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించి పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు విజయభాస్కర్,దర్శి వెంకటరమణయ్య, యడపల్లి గోపీచంద్,గునుపూడి ఆనందరావు(నందా),సొల్లేటి వెంకట భాస్కర్,విశ్వనాథం నాగరాజు,నున్న వెంకట లక్ష్మీనారాయణ,బచ్చు రామకృష్ణ,మెంటా సత్యనారాయణ,తన్నీరు శ్రీనివాసులు, సుంకేసుల నాగరాజు,ఇన్నమూరి కృష్ణా శ్రీనివాసులు,సోల్లెటి సందీప్,అయ్యపు సురేష్,చాటిగొండు శ్రీనివాసులు,కస్సేట్టి జయప్రకాశ్, ఓలేటి సత్యనారాయణ, గాధంశెట్టి హిమకుమార్ భక్తులు పాల్గొన్నారు.