శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో ప్రత్యేక పూజలు
కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 1 కోట మండలం కోటలోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవి దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం అమ్మవారికి దేవస్థాన కమిటీ అధ్యక్షులు విశ్వనాథం నాగరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక పూల అలంకరణ,వివిధ రకాల అభిషేకాలతో పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని లలిత సహస్రనామ పారాయణం వాసవి స్తుతి కార్యక్రమాన్ని నిర్వహించారు.తదుపరి అమ్మవారికి పల్లకిసేవ నిర్వహించిమంగళ హారతి సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.అనంతరం దేవస్థాన సమన్వయకర్త...