కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 6
కోట మండలం గూడలి గ్రామంలో వెలసియున్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ రోజు సోమవారం ఆలయ
కమిటీ సభ్యులు,తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నాయకులు ఆలయ ప్రధాన అర్చకులు కార్తీక్ స్వామి చేతుల మీదుగా స్వామి అమ్మ వార్లకు మహావ్యాస రుద్రాభిషేకం ధ్వజారోహరణం కొడి వస్త్రముల సమర్పణ వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ధ్వజస్తంభం వద్ద ప్రధాన కార్యమైన కొడి ముద్దలను భక్తుల పైకి వేయగా ఎంతో పవిత్రంగా భావించే కొడి ముద్దల కోసం భక్తులు తమ కొంగులతో భక్తిశ్రద్ధలతో పోటీపడి స్వామి అమ్మవార్ల కొడి ముద్దలను దక్కించుకున్నారు.ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.