swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 20 April 2026, 7:37 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

సీఎం చంద్రబాబు నాయుడు కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి

కోట స్వర్ణసాగరం ఏప్రిల్ 20

ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు కోట మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన టిడిపి నేత జిల్లా రైతు కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి 76 వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి పోరాటం దేశానికే ఆదర్శమన్నారు.ఇంత పెద్ద వయస్సులో కూడా విశ్రాంతి లేకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అలుపెరుగని పోరాటం చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న మహా నాయకుడు నారా చంద్రబాబు నాయుడుకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నానని,ఆ భగవంతుడు ఆయనకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని అన్నారు.