స్వార్థపూరిత రాజకీయాలు మానుకొని ప్రజా శ్రేయస్సుకు సహకరించండి-కోట ఎంపీటీసీలు
కోట మండలం కోట దళితవాడలో ప్రజా శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని నూతనంగా నిర్మిస్తున్న హెల్త్ సెంటర్ ను ఆపించడానికి కొంతమంది స్వార్థపూరిత రాజకీయాలు చేస్తున్నారని,స్వార్థపూరిత రాజకీయాలు మానుకుని ప్రజా అభివృద్ధికి సహకరిస్తే బాగుంటుంది అని ఎంపీటీసీలు షేక్ శంషుద్దీన్,దారా సురేష్ లు అన్నారు. సోమవారం స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో తహసిల్దార్ జయ జయ రావు కు హెల్త్ సెంటర్ నిర్మాణ విషయంపై విచారణ జరిపి నిర్మాణ పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఎంపీటీసీలు,దారా...