కోట స్వర్ణసాగరం మే 1
కోట మండలం తిన్నెలపూడి గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాళెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయులు రామిరెడ్డి వేంకటరామిరెడ్డి,హైమావతమ్మ, లావణ్య,మధు కిరణ్ రెడ్డి కుటుంబ సభ్యుల ఆర్థిక సౌజన్యంతో మాసం మాసం శ్రీవారి కల్యాణ మహోత్సవంలో భాగంగా సంస్థ ప్రతినిధులు పారా నందకిషోర్ శర్మ,అరసి నరేష్ శర్మలు శాస్త్రోక్తంగా స్వామివారి కల్యాణ ఘట్టములను వివరిస్తూ విఘ్ణేశ్వర పూజ, పుణ్యాహ వాచనం,కంకణ ధారణ,వస్త్ర సమర్పణం,మాంగల్య ధారణ,యజ్ఞోపవీత ధారణ,తలంబ్రాలు,మాల మార్పిడి కార్యక్రమాలను కనులవిందుగా జరిపించారు. దుప్పల వెంకటేశ్వర్లు, సుజాత,కేతంరెడ్డి సురేంద్రరెడ్డి,మమత దంపతులు పూజాకర్తలుగా పాల్గొన్నారు.ఎన్.బి.కె.ఆర్ ఐ.ఎస్.టి ఐ.టీ ఏ.ఐ.డీ.ఎస్ విభాగం వారు విచ్చేసిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు.పూనమల్లి సునీల్ కుమార్ బృందంచే అన్నమాచార్య కీర్తనలు,లేబూరు సాయి బృందం నాదస్వర కచేరి భక్తులను అలరింపజేశాయి.ఈ కార్యక్రమంలో సుష్మా రెడ్డి,మల్లి,నులక కోటయ్య,విజయలక్ష్మి,కోన సాయిబాబు శర్మ తదితరులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం విచ్చేసిన భక్తులకు కళ్యాణ తలంబ్రాలు,తీర్థప్రసాదాలను నిర్వాహకులు అందజేశారు.