swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 8:47 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

అంబరాన్నంటిన టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

కోట స్వర్ణసాగరం మే 20

కోట మండలం విద్యానగర్ లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆయన అభిమానులు,స్నేహితులు శ్రేయోభిలాషులు తెలుగుదేశం పార్టీ నాయకులు మధ్య అంబరాన్ని అంటాయి. ఆయన అభిమానులు నాయకులు కార్యకర్తలు,ముఖ్యంగా రైతులు వందలాది మంది మోహన్ రెడ్డి స్వగృహానికి చేరుకుని పూలమాలలు,శాలువాలతో ఘనంగా సత్కరిస్తూ పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ నేపథ్యంలో భారీ కేకు కట్ చేసి బాణసంచా వేడుకలతో జరిగిన నెల్లూరు మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఓ పండుగలా జరిగాయి.తన స్వగ్రామమైన నెల్లూరు పల్లి కొత్తపాలెం గ్రామంలో గ్రామస్తులు ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మోహన్ రెడ్డి పై తమకున్న అభిమానాన్ని గ్రామం మొత్తం భారీ ఫ్లెక్సీలు వాల్ పోస్టర్లు ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి అభిమానాన్ని చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో కోట మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు,మోహన్ రెడ్డి అభిమానులు ముఖ్యంగా రైతులు భారీగా పాల్గొన్నారు.