swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 10 May 2026, 9:18 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

అన్ బిన్ సువడుగల్ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలు

కోట స్వర్ణసాగరం మే 10

కోట మండలం కొక్కపాడు గ్రామంలో చర్చిలో అన్ బిన్ సువడుగల్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.అన్ బిన్ సువడుగల్ సంస్థ మరియు బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాతృమూర్తులను శాలువాలతో ఘనంగా సత్కరించి వారి చేత కేక్ కట్ చేయించి మాతృ దినోత్సవ సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా
అన్ బిన్ సువడుగల్ సంస్థ చైర్మన్ మాట్లాడుతూ భగవంతుడు అన్నిచోట్లా ఉండలేక అమ్మను సృష్టించాడని,అమ్మ చిన్నతనంలో మనకు నడకే కాదు నాగరికతనూ నేర్పిస్తుందని,అంతులేని ప్రేమానుగారాలకు,ఆప్యాయతకు మారుపేరైన అమ్మ అని తల్లి పోయి తనకున్న మమకారాన్ని చూపారు.తల్లి ప్రేమ,త్యాగం మరియు కుటుంబం కోసం ఆమె పడే శ్రమను గుర్తించి,గౌరవించడానికి ఈ దినోత్సవం అంకితం చేయబడిందని అన్నారు.
ఈ లోకంలో నువ్వు ఎంత ద్వేషించిన,నిన్ను ప్రేమించే వ్యక్తి ఒక్క అమ్మ మాత్రమేనని భూపతి మోహన్ సాయి తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ భూపతి మోహన్ సాయి,బి.వై.ఎఫ్ కన్వీనర్ శ్రీరామ్ శివ ప్రసాద్,కో కన్వీనర్ రంజిత్,న్యాయవాది అశోక్ కాంబ్లే,స్వరూప్,తదితరులు పాల్గొన్నారు.