swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 16 May 2026, 9:14 am Digital Edition : Munibaskar Varadaiahpalem

ఇందిరా నగర్ గ్రామ సచివాలయంలో ప్రింటర్ ఏర్పాటుఅర్జీలు, వార్తలపై స్పందించిన అధికారులు

వరదయ్య పాలెం స్వర్ణ సాగరం మే 15

వరదయ్యపాలెం మండలం ఇందిరా నగర్ గ్రామ సచివాలయంలో ప్రింటర్ సౌకర్యాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామ ప్రజలకు ధృవపత్రాలు, సేవలు వేగంగా అందించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.గ్రామ సచివాలయంలో ప్రింటర్ లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజు అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ప్రముఖ దినపత్రికల్లో వార్తలు ప్రచురితమవడంతో ఎంపీడీఓ కార్యాలయం స్పందించి తక్షణ చర్యలు చేపట్టింది.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్,వరదయ్యపాలెం ఎంపీడీఓ విజయమ్మ, డిప్యూటీ ఎంపీడీఓ బసిరెడ్డి, వెల్ఫేర్ అసిస్టెంట్ శ్రావణి పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ప్రింటర్ ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ అధికారులకు, సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన డీవీఎంసీ మెంబర్ గుత్తి త్యాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు.