swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 07 May 2026, 4:52 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

ఉత్తమ విద్యార్థి ఉడతా ధనుష్ చంద్ర కు ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతిల మీదుగా సన్మానం

కోట స్వర్ణసాగరం మే 7

పదవ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను గూడూరులోని డిఆర్డబ్ల్యు కళాశాలలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గురువారం ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కోట మండలం కొక్కపాడు జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నందు 509 మార్కులు సాధించి పాఠశాలలో మొదటి ర్యాంకు ను సొంతం చేసుకున్న ఉడతా ధనుష్ చంద్ర ను గురువారం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ శాలువతో సత్కరించి బహుమతి అందించి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జాతిని విద్యార్థులకు లాప్టాప్ లు మరియు వాచ్ లు బహుమతులుగా అందజేయడం జరిగిందన్నారు.ప్రతిభా వంతులను ప్రోత్సహించి వారిని మరింత ఉత్తేజ పరచడం వలన వారు ఇంకా మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉందన్నారు.అనంతరం వారికి విద్యాభ్యాసం చేసిన గురువులకు కూడా సన్మానాలు చేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి,జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్,జిల్లా రైతు విభాగ కార్యదర్శి నెల్లూరు మోహన్ రెడ్డి తదితరులు ఉన్నారు.