swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 3:55 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

ఎమ్మెల్యే చొరవతో కొత్త అరుంధతీయవాడ తాగునీటి సమస్యకు పరిష్కారం

కోట స్వర్ణసాగరం మే 11

కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని కొత్త అరుంధతీయవాడలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చొరవతో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.గత రెండు మూడేళ్లుగా కొత్త అరుంధతీయవాడలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున ప్రజలు నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతుండేవారు.అయితే వారి సమస్యను కల్లారా చూసిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి స్పందించి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు త్రాగునీటి సమస్య పరిష్కారానికి నిధులు మంజూరు చేయవలసిందిగా కోరారు.వెంటనే స్పందించిన స్థానిక ఎమ్మెల్యే నిధులు మంజూరు చేయించి గ్రామంలోని ప్రధాన వాటర్ ట్యాంక్ నుండి కొత్త అరుంధతీయవాడ వరకు సుమారు 500 మీటర్ల వరకు కొత్త పైపులైన్ పనులను వెంటనే పూర్తి చేయించారు.ఈ సందర్భంగా పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ప్రజలు పడుతున్న ఇబ్బందులను సమస్యలను తెలిపిన వెంటనే ఆ సమస్యలను తమ సమస్యలుగా భావించి సమస్యల పరిష్కారానికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు.తమ గ్రామంలో ఎటువంటి సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన వెంటనే స్పందిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి తక్షణ చర్యలు తీసుకుంటున్న ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు రుణపడి ఉంటామని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా గూడలి అరుంధతీయవాడ ప్రజలు ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డితో పాటు పంచాయతీ కార్యదర్శి జీవన్ కుమార్,స్థానిక నాయకులు,గ్రామ ప్రజలు ఉన్నారు.