ఎమ్మెల్యే చొరవతో కొత్త అరుంధతీయవాడ తాగునీటి సమస్యకు పరిష్కారం
కోట స్వర్ణసాగరం మే 11 కోట మండలం గూడలి పంచాయతీ పరిధిలోని కొత్త అరుంధతీయవాడలో గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ చొరవతో ప్రజలు ఎదుర్కొంటున్న త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభించిందని తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి తెలిపారు.గత రెండు మూడేళ్లుగా కొత్త అరుంధతీయవాడలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉన్నందున ప్రజలు నీటి కోసం అనేక ఇబ్బందులు పడుతుండేవారు.అయితే వారి సమస్యను కల్లారా చూసిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి స్పందించి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్...