swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 6:08 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

జండ్రపేట గ్రామంలో తీవ్ర త్రాగునీటి సమస్య

స్వర్ణసాగరం వాకాడు

మండలంలోని కొండాపురం పంచాయతీ పరిధిలోని జండ్రపేట గ్రామంలో గత మూడు రోజులుగా తీవ్రమైన త్రాగునీటి సమస్య నెలకొంది.ఈ గ్రామంలో ఒకే మోటార్ పై ఆధారపడటం వల్ల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోజురోజుకీ నీటి కొరత పెరుగుతూ ఉండటంతో మహిళలు,వృద్ధులు,చిన్నపిల్లలు దూర ప్రాంతాల నుండి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న వేళ నీటి అవసరం మరింత పెరిగింది.అయితే ఈ సమస్యపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎటువంటి స్పందన చూపకపోవడం గ్రామస్తుల్లో ఆగ్రహం చెందుతున్నారు ఈ సమస్యపై తక్షణ చర్యలు తీసుకుని అదనపు మోటార్ ఏర్పాటు చేయాలని,నీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.సమస్యను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చూపించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేసారు.