జండ్రపేట గ్రామంలో తీవ్ర త్రాగునీటి సమస్య

స్వర్ణసాగరం వాకాడు మండలంలోని కొండాపురం పంచాయతీ పరిధిలోని జండ్రపేట గ్రామంలో గత మూడు రోజులుగా తీవ్రమైన త్రాగునీటి సమస్య నెలకొంది.ఈ గ్రామంలో ఒకే మోటార్ పై ఆధారపడటం వల్ల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.రోజురోజుకీ నీటి కొరత పెరుగుతూ ఉండటంతో మహిళలు,వృద్ధులు,చిన్నపిల్లలు దూర ప్రాంతాల నుండి నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.ముఖ్యంగా ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న వేళ నీటి అవసరం మరింత పెరిగింది.అయితే ఈ సమస్యపై సంబంధిత అధికారులు ఇప్పటివరకు ఎటువంటి స్పందన చూపకపోవడం గ్రామస్తుల్లో ఆగ్రహం చెందుతున్నారు...