టీబీ ముక్త భారత్ అభియాన్ నే లక్ష్యంగా
నిడుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహణ
*స్వర్ణసాగరం వాకాడు ఏప్రిల్ 30*
మండలంలోని నిడుగుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ స్రవంతి,డాక్టర్ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో టీబీ సూపర్వైజర్ గోవర్ధన్ పర్యవేక్షణలో ‘టీబీ ముక్త భారత్ అభియాన్’100 రోజుల కార్యక్రమం లో భాగంగా హ్యాండ్‌హోల్డ్ ఎక్స్-రే ప్రోగ్రామ్ నిర్వహించారు.ఈ సందర్భంగా టీబీ సూపర్వైజర్ గోవర్ధన్ మాట్లాడుతూ టీబీ ముక్త భారత్ అభియాన్ కింద 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో టీబీ వ్యాదిగ్రాస్తులకు,వారికి సకాలంలో చికిత్స అందించడం లక్ష్యమని,హ్యాండ్‌హోల్డ్ ఎక్స్-రే యూనిట్ ద్వారా రోగనిర్ధారణ సులభం అవుతుందని టీబీ నిర్మూలనలో అందరూ సహకరించాలని వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ స్రవంతి,డాక్టర్ పృధ్విరాజ్,టీబీ సూపర్వైజర్ గోవర్ధన్,హెల్త్ సూపర్వైజర్ సలోమి,సిహెచ్‌ఓలు, ఏఎన్‌ఎంలు,ఆశా వర్కర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.