దివ్యాంగ యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ధేందుకు శిక్షణ- శ్రీసిటీ ఎండీ

శ్రీసిటీ,స్వర్ణ సాగరం మే 26, 2026: దివ్యాంగ యువతను  పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని శ్రీసిటీలో త్వరలో ప్రారంభించనున్నట్లు శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి తెలిపారు. విజయవాడలో ఈ నెల 25న నిర్వహించిన ఎంఎస్‌ఎంఈ గ్రోత్ సమ్మిట్–2026లో ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో ఈ మేరకు  శ్రీసిటీ ఎండీ అవగాహన ఒప్పందం (MoU)పై సంతకం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. గ్రోత్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, దివ్యాంగ యువతకు వ్యవస్థాపక...