swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 9:31 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

నిరుపేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్- పల్లెమల్లు వెంకట కృష్ణారెడ్డి 

కోట స్వర్ణసాగరం మే 1

నిరుపేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నిలుస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి అన్నారు.కోట మండలం గూడలి గ్రామంలోని కొత్త అరుంధతి వాడకు చెందిన గుంటక పెంచలయ్య కు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రభుత్వం అందిస్తున్నది.అయితే కొంతకాలం క్రితం ఆయన మరణించడంతో గుంటక పెంచలయ్య భార్య గుంటక అమరావతి కి నూతన పెన్షన్ను తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డి సచివాలయ సిబ్బంది చేతుల మీదుగా ఆమెకు అందించారు.ఈ సందర్భంగా గుంటక అమరావతి మాట్లాడుతూ తన భర్త చనిపోయిన తర్వాత ఆయనకు వస్తున్న పెన్షన్ను తమకు మంజూరు చేయించిన గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కి అందుకు సహకరించిన స్థానిక టిడిపి నాయకులు పల్లెమల్లు వెంకటకృష్ణారెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.జీవితాంతం ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు వెంకటకృష్ణారెడ్డికి రుణపడి ఉంటాను అని ఆమె ఈ సందర్భంగా ఆనందం వ్యక్తం చేసింది.