కోట స్వర్ణసాగరం మే 3
నిరుపేద ప్రజల ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కొండంత అండగా నిలుస్తుందని టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి అన్నారు.కోట మండలం నెల్లూరు పల్లి కొత్తపాలెం గ్రామానికి చెందిన మారుబోయిన రమేష్ కొంతకాలంగా అనారోగ్య సమస్యతో చెన్నై నగరంలో చికిత్స చేయించుకున్నారు. అయితే అతనిది నిరుపేద కుటుంబం కావడంతో చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో స్థానిక టీడీపీ నాయకులైన నెల్లూరు మోహన్ రెడ్డికి తమ సమస్యను వివరించి భాదను వెల్లబోసుకున్నారు.ఈ నేపథ్యంలో నెల్లూరు మోహన్ రెడ్డి గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ దృష్టికి మారుపోయిన రమేష్ ఆరోగ్య పరిస్థితి వివరాలను తీసుకెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ పథకం కింద ఆర్థిక సహాయం చేయాలని కోరారు.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ సీఎం రిలీఫ్ ఫండ్ పథకంలో 54896 రూపాయల చెక్కును శనివారం గూడూరు లోని తెలుగుదేశం పార్టీ క్యాంపు కార్యాలయం నందు ఎమ్మెల్యే సునీల్ కుమార్,నెల్లూరు మోహన్ రెడ్డి చేతుల మీదుగా బాధితునికి చెక్కును అందించారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అధిక చికిత్స ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థికంగా ఆదుకుంటుందని సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఒక వరమని అన్నారు.ఈ సందర్భంగా అనారోగ్య బాధితులు మారిపోయిన రమేష్ మాట్లాడుతూ సమస్యను తెలిపిన వెంటనే స్పందిస్తూ తమకు స్థానికంగా అండగా నిలుస్తూ కొండంత మనోధైర్యాన్ని ఇస్తున్న గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కి,నెల్లూరు మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోట మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, కోట మండలం మాజీ అధ్యక్షులు మద్దాలి సర్వోత్తమ రెడ్డి,కోటేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.