swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 7:27 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

నెల్లూరు మోహన్ రెడ్డి చేతుల మీదుగా పల్లమాల వెంకట రత్నమ్మ కు కుట్టు మిషన్ పంపిణీ

కోట స్వర్ణసాగరం మే 26

కోట మండలం కోటలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాల వారికి వారి జీవనాదారం నిమిత్తం కుట్టు మిషన్ లను పంపిణీ చేశారు.అందులో భాగంగా నెల్లూరుపల్లి కొత్తపాళెం గ్రామానికి చెందిన పల్లమాల వెంకట రత్నమ్మ భర్త పరిపూర్ణ అనే నిరుపేద మహిళకు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు రోటరీ క్లబ్ సభ్యులు నెల్లూరు మోహన్ రెడ్డి చేతుల మీదుగా 20వేల రూపాయల విలువ గల కుట్టు మిషన్ ను అందించారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ రోటరీ క్లబ్ నిరుపేదలకు ఎంతగానో అండగా నిలుస్తుందని రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మునుముందు ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకు వస్తుందని అన్నారు.తమకు కుట్టు మిషన్ ను అందించిన రోటరీ క్లబ్ సంస్థకు అందుకు సహకరించిన నెల్లూరు మోహన్ రెడ్డికి పల్లమాల వెంకటరత్నమ్మ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.