swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 03 May 2026, 8:56 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్ సెర్చ్- సీఐ కిషోర్ బాబు

కోట స్వర్ణసాగరం మే 3

కోట మండలం విద్యానగర్ లోని ప్రకాశం కాలనీ నందు ఆదివారం తెల్లవారు జామున గూడూరు రూరల్ సీఐ కిషోర్ బాబు మరియు కోట ఎస్సై పవన్ కుమార్ లు కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.గూడూరు రూరల్ పరిధి లోని పోలీసుల బృందంతో కలిసి ప్రతి ఇంటికి తిరిగి వాహనాలను పరిశీలించి సరైన పత్రాలు లేనటువంటి  వాహనాలను సీజ్ చేసి కోట పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా సీఐ కిషోర్ బాబు మాట్లాడుతూ ప్రకాశం కాలనీలో సరైన పత్రాలు లేనటువంటి 10 మోటార్ సైకిళ్లను రెండు ఆటోలను గుర్తించామని అదేవిధంగా కార్డెన్ సెర్చ్ ద్వారా ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు కాలనీలో నివసిస్తున్న అలాంటి వారిని గుర్తించి నిఘావేయడం జరుగుతుందని అన్నారు.గ్రామాలలో ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న గంజాయి,అక్రమ మద్యం, జూదం వంటి కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని, అలా సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.ఈ కార్డెన్ సెర్చ్ లో గూడూరు రూరల్ పరిధిలోని గూడూరు రూరల్,చిల్లకూరు,కోట పోలీసులు పాల్గొన్నారు.