swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 8:12 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ బట్టా అనిల్ కుమార్ జన్మదిన వేడుకలు

కోట స్వర్ణసాగరం మే 11

వాకాడు మండలం
బాలిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన న్యూస్ విశేషాలు దినపత్రికా ఎడిటర్ బట్టా అనిల్ కుమార్ జన్మదిన వేడుకలను బహుజన యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో జర్నలిస్ట్ బట్టా అనిల్ కుమార్ ను బహుజన యూత్ ఫోర్స్ నాయకులు శాలువాతో సత్కరించి అనంతరం బి వై ఎఫ్ నాయకులు అనిల్ కుమార్ తో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా బి వై ఎఫ్ నాయకులు మాట్లాడుతూ అనిల్ కుమార్ అతి తక్కువ కాలంలో జర్నలిజంలోకి అడుగుపెట్టి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదిలా నిలుస్తూ సొంత దినపత్రికను స్థాపించి నిత్యం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ మంచి పేరు ప్రతిష్టలు సంపాదించారని అన్నారు.ఈ కార్యక్రమంలో బి వై ఎఫ్  సలహాదారులు ముమ్మడి వెంకట సుబ్బయ్య, ఐవీ రమణయ్య,దాసరి సుందరం,దార్ల ఏడుకొండలు,బి వై ఎఫ్ కన్వీనర్ శ్రీరాం శివ ప్రసాద్ (శంకర్),అన్ బిన్ సువడుగుల్ సంస్థ డైరెక్టర్ భూపతి మోహన్ సాయి,న్యాయవాది దాసరి అశోక్ కాంబ్లే తదితరులు పాల్గొన్నారు.