మనుబోలు “యంజీసీటీ జట్టు”విజయకేతనం

మనుబోలు, స్వర్ణసాగరం : కాగితాలపూరు మైదానంలో నిర్వహించిన శశి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో మనుబోలు యంజీసీటీ జట్టు ఘన విజయం సాధించింది. ఫ్రెండ్స్ ఎలెవన్ కాగితాలపూరు జట్టుతో జరిగిన తుది పోరులో అన్ని విభాగాల్లో ఆధిపత్యం చాటుతూ టైటిల్‌ను కైవసం చేసుకుంది.టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన మనుబోలు యంజీసీటీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసింది. జట్టులో సతీష్ దూకుడుగా ఆడి 48 పరుగులతో జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర...