🔵మరోసారి మానవత్వాన్ని చాటుకున్న బహుజన యూత్ ఫోర్స్
🔵మట్టిలో మాణిక్యం దారా సంతోష్ కు అండగా బహుజన యూత్ ఫోర్స్
🔵ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్న బహుజన యూత్ ఫోర్స్
కోట స్వర్ణసాగరం మే 19
ఇటీవల స్థాపించిన బహుజన యూత్ ఫోర్స్ సంస్థ గూడూరు నియోజకవర్గంలో యువతను చైతన్యపరుస్తూ యువతలో సామాజిక బాధ్యతను రగుల్చుతూ,సమ సమాజ స్థాపన కోసం పోరాటం చేసిన మహనీయుల ఆలోచనలను భుజస్కందాలపై వేసుకొని బహుజన ఉద్యమ రథాన్ని ముందుకు లాగడం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న బహుజన యూత్ ఫోర్స్ సంస్థ అటు మహనీయుల మార్గంలో రాజీ లేని పోరాటం చేయడమే కాకుండా ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడుతూ సమాజ సేవలో సైతం దూసుకుపోతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది.ఈ నేపథ్యంలో నాయుడుపేట మండలం మడఫలం గ్రామానికి చెందిన దారా సంతోష్ నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు చదివి 10 వ తరగతి పరీక్ష ఫలితాలలో 544 మార్కులు సాధించి గురుకులం టాపర్ గా నిలిచాడు.
అటు చదువులోనూ ఇటు క్రీడలలో కూడా అండర్ 14 జాతీయస్థాయి క్రీడల్లో సంతోష్ 2024-25 ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్పూర్ లో జరిగిన కుస్తీ పోటీ లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున జాతీయ స్థాయి క్రీడాకారునిగా సంతోష్ గుర్తింపు పొందారు.అయితే సంతోష్ కుటుంబం కటిక పేదరికంలో ఉంది. ఉండటానికి సరైన ఇల్లు కూడా లేదు.ఉన్నత చదువులు చదువుకోవడానికి స్తోమత లేదు. అయితే ఇటీవల తన తల్లి మరణం,తండ్రి అనారోగ్య పరిస్థితి తన పై చదువులకి ఆటంకం కలిగింది.తండ్రిని ఎలా చూసుకోవాలో ఎలా చదవాలో దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో బహుజన యూత్ ఫోర్స్ ను కలిసి సహాయం కోరాడు.వెంటనే స్పందించిన బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మంగళవారం సంతోష్ స్వగృహంలో శాలువాలతో సత్కరించి ఐదు వేల రూపాయల నగదు ఆర్థిక సహాయం,పండ్లు అందించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.అనంతరం స్కూల్ టాపర్ గా నిలిచిన దారా సంతోష్ ని అభినందించారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ దారా సంతోష్ చదువుకు పేదరికం అడ్డు కాకూడదని అతని చదువుకు బహుజన యూత్ ఫోర్స్ అండగా నిలుస్తుంది అని తెలిపారు.భవిష్యత్తులో దాతల సహాయంతో సంతోష్ చదువులకు దాతల సహాయంతో సంతోష్ వెన్నంటే ఉంటూ డాక్టర్ అవ్వాలని అతని కలని నెరవేర్చే దిశగా తమవంతు కృషి చేస్తామని తెలిపారు.బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరామ్ శివప్రసాద్ (శంకర్) మాట్లాడుతూ దారా సంతోష్ కుటుంబానికి తాను ఒక పెద్ద కొడుకుల ఉండి డాక్టర్ చదవాలని సంతోష్ కోరికను తీర్చేందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు.అనంతరం అన్ బిన్ సువడుగల్ సంస్థ డైరెక్టర్ భూపతి మోహన్ సాయి మాట్లాడుతూ దారా సంతోష్ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాల చదువు కోసం అయ్యే పుస్తకాలను తన సంస్థ ద్వారా అందిస్తానని ప్రకటించారు.ఎవరైనా దాతలు నాయకులు స్పందించి చదువు పట్ల ఇంతటి మమకారం చూపుతున్న దారా సంతోష్ ఉన్నత చదువులకు సహాయం చేయాలని ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు తెలిపారు.ఆపదలో ఉన్న వారిని వెంటనే ఆదుకుంటూ పేద ప్రజలకు ఎవరికి ఏ సమస్య వచ్చిన మేమున్నామంటూ భరోసా కల్పిస్తూ వారికి ధైర్యాన్నిస్తున్న బహుజన యూత్ ఫోర్స్ సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు.ఈకార్యక్రమంలో
బహుజన యూత్ ఫోర్స్ కన్వీనర్ శ్రీరాం శివ ప్రసాద్,గౌరవ సలహాదారులు ఐవీ రమణయ్య,కర్లపూడి.వెంకట రమణయ్య, నాయకులు భూపతి మోహన్ సాయి, మీడియా కో ఆర్డినేటర్ పాకం చెన్నకేశవలు, న్యాయవాది దాసరి అశోక్ కాంబ్లే,బి.వై.ఎఫ్ నాయకులు దేవా,టీచర్ దారా బాబు,పీఈటీ టీచర్ కాటయ్య,పామంజి నాగేంద్ర,శ్రీరాం రవి, తూపిలి నిరంజన్,సుజిత్,బందిల గౌతమ్, తూపిలి వినోద్,ప్రశాంత్,రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.