swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 6:10 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

రెవిన్యూ సమస్యలపై తహసీల్దార్ కు వినతి పత్రం – మారంరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి

గ్రామంలోనే పట్టాపాస్ పుస్తకాల సవరణ

స్వర్ణసాగరం వాకాడు

మండల పరిధిలోని గంగన్నపాలెం గ్రామంలో భు రీసర్వే ద్వారా రైతులకు జారీ చేసిన పట్టా పాస్‌పుస్తకాల్లో వివరాలు తెలుగు,ఇంగ్లీషు భాషలలో ఉండాల్సి ఉండగా కేవలం తెలుగులో మాత్రమే ముద్రించి ఇంగ్లీషులో రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు స్థానిక వీఆర్వోను ఆశ్రయించగా వీఆర్వో సూచన మేరకు గ్రామంలోని రైతులందరూ మండల కార్యాలయానికి రావాలని చెప్పడంతో గ్రామస్తులు ఆందోళనకు గురైయ్యారు అధికారుల తప్పిదం వల్ల తలెత్తిన ఈసమస్య కోసం మండల కేంద్రానికి వచ్చి పడిగాపులు కాయడం వంటి ఇబ్బందులు లోనవుతారన్న సమస్యను గుర్తించిన జమిన్ కొత్తపాలెం మాజీ ఉపసర్పంచ్ మారం రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తహసీల్దార్ కు వినతిపత్రం అందచేశారు ఈ సమస్య పై స్పందించిన తహసీల్దార్ సయ్యద్ ఇగ్బాల్ గ్రామంలోనే గ్రామ సభ ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని అధికారుల వల్ల కలిగిన ఇబ్బందికి గ్రామస్తులు మండల కేంద్రం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని,త్వరలోనే స్వయంగా అధికారుల బృందంతో కలిసి గ్రామానికే వచ్చి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.