swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 8:10 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

విద్యా కెరటం కొట్టు సురేఖ ను అభినందించిన బహుజన యూత్ ఫోర్స్

కోట స్వర్ణసాగరం మే 22

కోట మండలం ఇటీవల విడుదలైన 10 వ తరగతి పరీక్ష ఫలితాలలో కోట జడ్పీ బాలికల హైస్కూల్ నందు చదివి 570 మార్కులు సాధించి మండల స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచిన ఊనుగుంటపాలెం గ్రామానికి చెందిన కొట్టు సురేఖ ను ఆమె స్వగృహంలో శుక్రవారం బహుజన యూత్ పోర్స్ నాయకులు ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు ఆ గ్రామానికి వెళ్ళి ప్రతిభను కనబరిచిన విద్యార్థిని కొట్టు సురేఖ ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేసి భారత రాజ్యాంగ గ్రంథాన్ని మరియు మూడు వేల రూపాయల నగదు బహుమతిని అందించారు.ఈ సందర్భంగా బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మాట్లాడుతూ విద్యకు పేదరికం అడ్డు కాకూడదని,ప్రతి పేదవాని జీవితంలో వెలుగులు నుంచే మహా ఆయుధం చదువు ఒకటేనని అన్నారు.ఆపదలో ఉన్న వారికి నిరుపేద ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు బహుజన యూత్ ఫోర్స్ ఎప్పుడు అండగా నిలుస్తుంది అని అన్నారు. సంస్థను స్థాపించిన అతి తక్కువ కాలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆపదలో ఉన్నవారికి తోడుగా నిలుస్తున్న బహుజన యూత్ ఫోర్ నాయకులను పలువురు ప్రజలు అభినందించారు.
ఈ కార్యక్రమంలో బహుజన యూత్ ఫోర్స్ గౌరవ సలహాదారులు ఐవీ రమణయ్య, దార్ల ఏడుకొండలు,కనుపూరు కృష్ణయ్య,మట్టిగుంట వెంకట సుబ్బయ్య,కన్వీనర్ శ్రీరాం శివ ప్రసాద్, నాయకులు మీజూరు మురళి,భూపతి మోహన సాయి,దాసరి.అశోక్ కాంబ్లే, యర్రబోతు నాగేంద్ర బాబు,తూపిలి సుధీర్, ఏడుకొండలు,సురేష్,ఊనుగుంటపాలె గ్రామస్తులు దాసరి రవి,చెముడుగుంట మణి,నాగరాజు,వాకాటి వెంకటేశ్వర్లు,విజయ్ బహుజన యూత్ ఫోర్స్ నాయకులు మొద్దు శ్యామ్,శ్రీరాం రవి,దాసరి విజయ్ గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.