swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 17 May 2026, 9:48 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

వి.సి.కే పార్టీ చీఫ్,ఎంపీ తోల్ తిరుమావళవన్ ను కలిసిన భూపతి మోహన్ సాయి

కోట స్వర్ణసాగరం మే 17

తమిళనాడుకు చెందిన విముక్త చిరుతల కక్షి (వి.సి.కే పార్టీ) జాతీయ అధ్యక్షుడు,ప్రస్తుత చిదంబరం ఎంపీ,తోల్ తిరుమావళవన్ ని చెన్నై అశోక్ నగర్లోని వి.సి.కే పార్టీ కార్యాలయం నందు శనివారం కోట మండలంకు చెందిన బహుజన నాయకులు, అన్ బిన్ సువడుగల్ సంస్థ చైర్మన్ భూపతి మోహన్ సాయి మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ విజయవంతంగా గెలుపొందిన సందర్భంగా అభినందనలు తెలుపుతూ, అలాగే తమిళ వెట్రి కలగం (టి.వి. కే) పార్టీకు మద్దతు తెలిపి,ప్రభుత్వ ఏర్పాటుకు తీసుకున్న నిర్ణయం హర్షణీయమైనదిని జాతీయ అధ్యక్షులు శ్రీ తోల్ తిరుమావళవన్ కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వారి వెంట అంబేద్కరిస్ట్ భూపతి పోలయ్య(రిటైర్డ్ హోమియోపతి కాంపౌండర్) పాల్గొన్నారు.