మనుబోలు,స్వర్ణ సాగరం:
హనుమజ్జయంతి ని పురస్కరించుకొని మంగళవారం మనుబోలు మండలంలోని మనుబోలు, వీరంపల్లి మడమనూరు,బద్దెవోలు,యాచవరం, కొండూరు కాతగితాలపూరు గ్రామంలో హనుమాన్ జయంతిని వైభవంగా నిర్వహించారు. మనుబోలు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో సాయంత్రం పూలంగి సేవను నిర్వహించారు. రాత్రి గుడి ఆవరణంలో శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళావేదిక నాట్యా చారిని కందల్ల సుస్మిత ఆధ్వర్యంలో కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. అనంతరం స్వామివారిని గజవాహనంపై కొలువు తీర్చి వివిధ ప్రత్యేక పూలతో అలంకరించారు. బాణాసంచా మోతల మధ్య డీజే, కోలాటం వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో వైభవంగా గ్రామోత్సవం ను నిర్వహించారు. గ్రామంలో వారి వాకిళ్ల వద్ద కాయ కర్పూరాన్ని సమర్పించారు.