శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామికి పల్లకి సేవ
మనుబోలు, స్వర్ణ సాగరం: మనుబోలు మండలం కేంద్రంలోని హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా శ్రీ ప్రసన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో పల్లకి సేవ నిర్వహించారు. ఇందులో భాగంగా స్వామి వారు యోగా ఆంజనేయ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకులు హనుమాన్ చారులు స్వామివారి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.