మనుబోలు, స్వర్ణసాగరం :
మండలంలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్ లో భాగంగా మూడు రోజులపాటు పంచాయతీ కార్యదర్శులకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇస్తున్నట్లు ఎంపీడీవో జలజాక్షి తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం మనుబోలులోని చెత్త సంపద కేంద్రంలో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చారు. తడి చెత్త పొడి చెత్త ఎలా సేకరించాలి. సేకరించిన చెత్తను ఎలా వర్గీకరించాలి. అన్నదానిపై క్షుణ్ణంగా వారికి శిక్షణ ఇచ్చారు. గ్రామాల్లో చెత్తా చెదరాలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో లు గరుడయ్య శ్రీనివాసులు పంచాయతీ కార్యదర్శులు శ్రీహరి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.