కోట స్వర్ణసాగరం మే 6
కోట మండలం కర్లపూడి పంచాయతీ పరిధిలోని సోన్నమోల దిబ్బ గిరిజన కాలనీపై బుధవారం స్వర్ణసాగరం దినపత్రికలో ప్రచురితమైన గిరిజన బ్రతుకులపై ఎందుకీ వివక్షత-నెల రోజులుగా త్రాగునీరు లేక విలవిల అనే వార్తకు స్థానిక కోట మండలం ఎంపీడీవో దిలీప్ కుమార్ నాయక్ వెంటనే స్పందించి కర్లపూడి పంచాయతీ సెక్రటరీ మేరీ రత్నకుమారి,ఇంజనీరింగ్ అసిస్టెంట్ లక్ష్మణ్ లకు వెంటనే గిరిజన కాలనీలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.ఈ నేపథ్యంలో పంచాయతీ సెక్రెటరీ మేరీ రత్నకుమారి ఇంజనీరింగ్ అసిస్టెంట్ లక్ష్మణులు సోన్నమోల దిబ్బ గిరిజన కాలనీని సందర్శించి త్రాగు నీటి పైపులను మరమ్మతులు చేయించి కాలనీకి త్రాగునీటినందించారు.ఈ సందర్భంగా స్థానిక గిరిజనులు రాము పడుతున్న త్రాగునీటి సమస్యను మీడియా ద్వారా అధికారులకు తెలియపరిచేందుకు కృషిచేసిన కర్లపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు కర్లపూడి రాంబాబుకు,త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపిన స్థానిక ఎంపీడీవో దిలీప్ కుమార్ నాయక్ కు,పంచాయతీ సిబ్బంది మేరీ రత్నకుమారి,లక్ష్మణ్ లకు సోన్నమోల దిబ్బ గిరిజన కాలనీవాసులు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.