swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 06 May 2026, 8:30 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

♦️గిరిజన బ్రతుకులపై ఎందుకీ వివక్షత-నెల రోజులుగా త్రాగునీరు లేక విలవిల

♦️అధికారులకు,స్థానిక నాయకులకు కానరాని గిరిజనుల కష్టాలు

♦️అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్న పట్టించుకొనే నాధుడే లేడు

♦️ఎలక్షన్ సమయంలో మాత్రమే మేము కనిపిస్తామా..సోన్నమోలా దిబ్బ గిరిజనులు

♦️అధికారులు నాయకులు ఎవరైనా స్పందించి మా దాహం తీర్చండి మహాప్రభో

కోట స్వర్ణసాగరం మే 6

కోట మండలం కర్లపూడి పంచాయతీ పరిధిలోని సన్నారెడ్డి కృష్ణారెడ్డి గిరిజన కాలనీ (సోన్నమోలా దిబ్బ) కాలనీలో గత నెలరోజులుగా త్రాగు నీరు లేక దాహంతో విలవిల అల్లాడిపోతున్నామని సోన్నమోలా దిబ్బ గిరిజనులు వాపోతున్నారు. అధికారులకు స్థానిక నాయకులకు తమ భాద, తాము పడుతున్న కష్టాలు ఎందుకు కానరావటం లేదని ప్రశ్నిస్తున్నారు.గిరిజనులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య గురించి అనేకసార్లు సచివాలయ సిబ్బందికి అధికారులకు మొరపెట్టుకున్న పట్టించుకునే నాధుడే లేడని వారు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.ఎలక్షన్ సమయంలో ఓట్లు కోసం మాత్రమే మేము పనికొస్తామా ఆ తర్వాత మా బాధలు పట్టించుకునే వారు ఎవరు దాహం తీర్చే వారు ఎవరని,మా కాలనీలో కనీస వసతులు కూడా లేవని,ఇప్పటికైనా అధికారులు నాయకులు ఎవరైనా స్పందించి ముందుగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపి తమ దాహం తీర్చాలని వారు ఈ సందర్భంగా కోరారు.