ఇండ్లలోకి ప్రవేశిస్తున్న డ్రైనేజీ వ్యర్థ నీరు-పట్టించుకోని కోట పంచాయతీ అధికారులు

♦️ఫిర్యాదు చేస్తేనే డ్రైనేజీ కాలువల క్లీనింగ్ లేకపోతే లేదు ♦️శ్యామసుందరపురం కాలనీలో డ్రైనేజీ కాలువల దుస్థితి కోట స్వర్ణసాగరం జులై 14 కోట మండలం శ్యామసుందర పురం కాలనీలో డ్రైనేజీ కాలువల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.డ్రైనేజీ కాలువలను పంచాయతీ సిబ్బంది సరిగ్గా శుభ్రం చేయకపోవడంతో డ్రైనేజీ కాలవలు నిండిపోయి మురికి వ్యర్థ నీరు ఇళ్ళలోకి ప్రవేశిస్తున్నాయని కాలనీవాసులు వాపోతున్నారు.పంచాయతీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందికి పలుమార్లు సమస్యలు తెలియజేసిన స్పందన లేదని కాలనీవాసులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంచాయతీ అధికారులకు సమస్య తెలియచేస్తే కొద్ది రోజులకి...