కోట స్వర్ణసాగరం జూన్ 3
గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ కు కోట మండలం కు చెందిన తెలుగుదేశం పార్టీ కోట మండల ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుమలశెట్టి కోటేశ్వరరావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా తిరుమలశెట్టి కోటేశ్వరరావు మాట్లాడుతూ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ తన పుట్టినరోజు వేడుకలను భారీ ఫ్లెక్సీలతో పెద్ద పెద్ద ఆడంబరాలతో జరపకూడదని నిరుపేదలకు మంచి చేసేలా ఉండాలనే ఆయన ఆకాంక్ష ఆనందనీయమని అన్నారు.ఇలాంటి ప్రజాసేవకుడు మునుముందు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మరెన్నో జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని, మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని తెలుపుతూ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.