swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 5:03 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

కోట మండలం వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఏర్పాటు

కోట స్వర్ణసాగరం జూన్ 12

సమాజ హితమే లక్ష్యంగా,ఒక్క వేదిక,-ఒక్క గొంతుక నినాదంతో శుక్రవారం కోట మండల వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ ఏర్పాటు చేశారు.కోట పట్టణంలో ఏర్పాటుచేసిన నిరాడంబర కార్యక్రమంలో కోట మండల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షులతో పాటు,కార్యవర్గ సభ్యులను,పూర్తి స్థాయి కమిటీ ని కూడా ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు.కోట మండలం వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షునిగా ఆర్ వి ఫౌండేషన్ చైర్మన్ ఏంబేటి వెంకట కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు.గౌరవ అధ్యక్షులుగా మస్తానయ్య,గౌరవ సలహా దారులుగా తిరుమలశెట్టి కోటేశ్వరరావు ఎన్నుకోబడ్డారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 25 సంవత్సరాలనుండి వివిధ పత్రికల్లో రిపోర్టర్ లు గా పత్రికా విలువ కాపాడుతూ, ప్రభుత్వానికి ప్రజలకి,ప్రజలకి అధికారులకు మధ్య వారదులుగా ఉంటూ  జర్నలిస్టులు సేవలు చేస్తున్నారన్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ది కూడా విలేకరులు పొందాలేదాన్నారు.ఇక నుంచి ప్రభుత్వం నుంచి వర్కింగ్ జర్నలిస్టులకు అందవలసిన సంక్షేమ పథకాలు సాధన కొరకు కార్యాచరణ  రూపొందించుకుంటున్నామన్నారు.ప్రతి జర్నలిస్ట్ తన విలువైన సమయాన్ని,ధనాన్ని వెచ్చించి పనిచేస్తున్నా సమాజంలో వివక్షతకు గురి అవుతున్నారు అన్నారు.రాబోవు రోజుల్లో  ఒక స్పష్టమైన అజెండాతో  జర్నలిస్టుల సంక్షేమం కోసం కలసికట్టిగా పనిచేస్తామన్నారు.ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకట కృష్ణయ్య,గౌరవ అధ్యక్షులు మస్తానయ్యకు,గౌరవసలహాదారు కోటేశ్వరరావు కోట మండలం జర్నలిస్టు యూనియన్ అభినందనలు తెలిపారు.కోట మండల వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్  ఉపాధ్యక్షులుగా పురిని సుబ్రహ్మణ్యం,ప్రధాన కార్యదర్శిగా పాకం చెన్నకేశవులు, కార్యనిర్వాహక కార్యదర్శిగా స్వరూప్, కోశాధికారిగా కట్టా.జనార్ధన్,కార్యవర్గ సభ్యులుగా మట్టిగుంట సురేంద్రబాబు,శ్రీరాం సురేష్,రవి నియమించబడ్డారు.