swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 7:34 pm Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

దుగరాజపట్నం పోర్టు భూసేకరణ పై రైతులతో శుక్రవారం సమావేశం

స్వర్ణసాగరం వాకాడు జూన్4

దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి వాకాడు మండలంలోని పలు గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం (జూన్ 5) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సయ్యద్ ఇక్బాల్ తెలిపారు.సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని పామంజి (423.85) ఎకరాలు,వాలమేడు (380.47) &(287.21) ఎకరాలు,పాతేటిపాళెం (226.00) ఎకరాలు, అందలమాల (0.32) ఎకరాలు వాగర్రు, తూపిలిపాళెం (504.55) ఎకరాలు, సంబంధిత గ్రామాల్లో మొత్తం వేల ఎకరాల భూమిని దుగరాజపట్నం పోర్టు నిర్మాణం కోసం సేకరించేందుకు ప్రాథమిక ప్రకటన జారీ చేసినట్లు పేర్కొన్నారు.భూనష్టపరిహారం, భూసేకరణకు సంబంధించిన అంశాలపై రైతుల అభిప్రాయాలు,సూచనలు తెలుసుకునేందుకు తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ సమావేశం వాకాడు తహశీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. భూములు కోల్పోతున్న రైతులు తప్పనిసరిగా హాజరై తమ సందేహాలు,అభిప్రాయాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని తహశీల్దార్ సయ్యద్ ఇక్బాల్ విజ్ఞప్తి చేశారు.