దుగరాజపట్నం పోర్టు భూసేకరణ పై రైతులతో శుక్రవారం సమావేశం

స్వర్ణసాగరం వాకాడు జూన్4 దుగరాజపట్నం పోర్టు నిర్మాణానికి సంబంధించి వాకాడు మండలంలోని పలు గ్రామాల్లో భూసేకరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో భూములు కోల్పోతున్న రైతులతో శుక్రవారం (జూన్ 5) ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు తహశీల్దార్ సయ్యద్ ఇక్బాల్ తెలిపారు.సూళ్లూరుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని పామంజి (423.85) ఎకరాలు,వాలమేడు (380.47) &(287.21) ఎకరాలు,పాతేటిపాళెం (226.00) ఎకరాలు, అందలమాల (0.32) ఎకరాలు వాగర్రు, తూపిలిపాళెం (504.55) ఎకరాలు, సంబంధిత గ్రామాల్లో మొత్తం వేల ఎకరాల భూమిని దుగరాజపట్నం పోర్టు నిర్మాణం కోసం సేకరించేందుకు ప్రాథమిక ప్రకటన జారీ...