ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయిద్దాం- పోలియోను తరిమికొడదాం -ఎంపీటీసీ షేక్ శంషుద్దీన్

కోట స్వర్ణసాగరం జూన్ 28 ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించి పోలియో మహమ్మారిని తరిమికొడదామని ఎంపీటీసీ షేక్ శంషుద్దీన్ అన్నారు.కోట మండలం శ్యామసుందరపురం కాలనీలో ఆదివారం ఎంపీటీసీ షేక్ శంషుద్దీన్ చిన్నారులకు పోలియో చుక్కలు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా షేక్ శంషుద్దీన్ మాట్లాడుతూ పోలియో అనేది చిన్నారులను జీవితాంతం వికలాంగులుగా మార్చే ప్రమాదకరమైన వ్యాధి.ఈ వ్యాధిని పూర్తిగా నివారించే శక్తి కేవలం రెండు పోలియో చుక్కలకే ఉందని, అందుకే భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం పల్స్ పోలియో కార్యక్రమం...