కోట స్వర్ణసాగరం జూన్ 3
కోట మండలం కోటలోని శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలో బుధవారం టీడీపీ నేత జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో చిన్నారుల నడుమ గూడూరు నియోజకవర్గం శాసనసభ్యులు,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ముందుగా టీడీపీ నాయకులు శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీవాసులు, చిన్నారులచే భారీ కేక్ ను కట్ చేయి అందరికీ పంచిపెట్టి ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా టిడిపి నాయకులు షేక్ జలీల్ అహ్మద్ మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తన జన్మదిన వేడుకలను ఫ్లెక్సీలు,వాల్ పోస్టులు,బానసంచాలు, పూలమాలలు సన్మానాలతో ఆడంబరాలు లేకుండా నిరాడంబరంగా నిరుపేదల మధ్య పదిమందికి ఉపయోగపడేలా జరగాలనే ఆయన ఆకాంక్ష పలువురికి ఆదర్శం అన్నారు. గూడూరు నియోజకవర్గ వ్యాప్తంగా గూడూరు నియోజకవర్గాన్ని గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి తర్వాత నియోజకవర్గానికి కొన్ని కోట్ల రూపాయల నిధులను తీసుకొని వచ్చి అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు ఒక్క ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ మాత్రమేనని అన్నారు.ఆయనను నమ్ముకున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలను హక్కున చేర్చుకునే వ్యక్తిత్వం గల వ్యక్తి సునీల్ కుమార్ అని అన్నారు.ఎంతో మంది అభాగ్యులు నిరుపేదలు అనారోగ్యంతో బాధపడుతుంటే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 8 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చిన ఘనత సునీల్ కుమార్ కే దక్కింది అన్నారు. కోట పట్టణ అభివృద్ధికి సుమారు ఐదు కోట్ల రూపాయల నిధులను కేటాయించడం జరిగిందని అన్నారు.అలాంటి అభివృద్ధి ప్రధాత సునీల్ కుమార్ జన్మదిన వేడుకలను నిరుపేదల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని తెలుపుతూ మరోసారి సునీల్ కుమార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మాణికల పవన్ కుమార్,నెల్లూరు మోహన్ రెడ్డి,కోకర్ల మధు యాదవ్,తిరుమల శెట్టి కోటేశ్వరరావు,షేక్ శంషుద్దీన్,నాయబ్, నౌషాద్,గూడూరు కిరణ్,తల్లం శ్రీనివాసులు, పోలమ్మ,సుహాసిని,మధు నాగేంద్ర,మీజూరు మధు బాబు,రూపేష్,తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.