swarnasagaram.com
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 9:29 am Digital Edition : Pakam chennakesavulu Kota Mandal

*🔶కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అభివృద్ధికి పెద్దపీట*

*🔶అభివృద్ధిపథంలో ముందంజ కొత్తపాలెం పంచాయతీ*

*🔶కోట మండలంలో మొదటి ప్రాధాన్యత సంతరించుకున్న మోహన్ రెడ్డి*

*🔶ఎమ్మెల్యే చొరవ,మోహన్ రెడ్డి కృషితో పంచాయతీలో  అభివృద్ధి పరుగులు*

*🔶కూటమి ప్రభుత్వం భేష్…అంటున్న ప్రజలు*

కోట స్వర్ణసాగరం జూన్ 12

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి కావొస్తున్న తరుణంలో కోట మండలంలో జరిగిన అభివృద్ధి పనులు సంక్షేమ పథకాల అమలు వివరాలు నెల్లూరుపల్లి కొత్తపాలెం పంచాయతీ మండలంలోనే మొదటి ప్రాధాన్యత సంతరించుకుని అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.కూటమి ప్రభుత్వం ఏర్పడి తరువాత మొట్ట మొదటగా నెల్లూరు మోహన్ రెడ్డి ముందుచూపు గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ సహకారంతో రైతులకు మేలు జరిగే విధంగా పెన్నకి చెరువు కట్టను 15 లక్షల రూపాయల నిధులతో పటిష్ట పరచారు.పంచాయతీలో మూడు నీటి తొట్టెలు నిర్మించి మూగజీవాలకు త్రాగునీరు అందించి గోమాతల రుణం తీర్చుకున్నారని స్థానిక ప్రజలు చెబుతున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నెల్లూరుపల్లి గిరిజన కాలని,వెంకురెడ్డి గిరిజన కాలని,దయాకర్ రెడ్డి కాలనీల్లో25 లక్షల రూపాయలతో సిమెంటు రోడ్లు నిర్మించి పేద ప్రజల మన్ననలు పొందారు మోహన్ రెడ్డి.అదేవిధంగా వేసవిలో త్రాగు నీటి ఎద్దడి లేకుండా పంచాయతీలో అవసరం ఉన్న చోట 5 లక్షల రూపాయలతో త్రాగు నీటి బోర్లు వేయించి అన్ని వర్గాల ప్రజల మన్ననలతో పాటు ఆశీస్సులు పొందారు.వర్షాకాలంలో ముంపునకు గురవుతున్న ప్రాంతాల బాధలు గమనించి వర్షాకాలం రాక ముందే గ్రామంలో 32 లక్షల రూపాయలతో డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేశారు.ఎన్నో ఏళ్లుగా ఇరుకు రోడ్డుతో ప్రయాణం ప్రాణసంకటంగా ఉన్న అగ్రహారం రోడ్డును 10 లక్షల రూపాయలతో వెడల్పు చేసి 5 వందల ఎకరాల రైతులు ధాన్యం సులభంగా మార్కెట్ కు తరలించుకునేలా అభివృద్ధి పరచి రైతుల మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నెల్లూరు మోహన్ రెడ్డి.ఇలా ఒకటేమిటి పేద ధనిక కులమతాలకు అతీతంగా అనారోగంతో బాధపడేవారికి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పేద ప్రజలకు లక్షల రూపాయలు సాయం అందించిన ఘనత ఆయనకే దక్కుతుంది.రైతులకు ఉపయోగ పడే యంత్రాలు,విత్తనాలు,ఎరువులు సకాలంలో రైతులకు అందించేందుకు మండలంలోని తోటి నాయకులతో పోటీ పడి మరీ గ్రామానికి తీసుకొచ్చే ముందుచూపు ఉన్న నాయకుడు నెల్లూరు మోహన్ రెడ్డి అని ప్రజలు కొనియాడుతున్నారు.పై వివరాలు  విషయాలుపై తెలుగుదేశంపార్టీ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి ని వివరణ కోరగా ప్రజలకు చేసింది చెప్పుకోనవసరం లేదు.ప్రజలకు మేలు జరిగి ఉంటే వాళ్లే చెప్పుకుంటారు.మా గ్రామంలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో,ఇప్పటి కూటమి ప్రభుత్వంలో వేగంగా  అభివృద్ధి పనులు ప్రజలకు మంచి జరిగాయంటే ఆది మాశాసన సభ్యులు పాశం సునీల్ కుమార్ సహాయ సహకారాలు మాత్రమేనని అన్ని వర్గాలకు మేలు చేసి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నామని అని ఆయన అన్నారు.