ఎస్సీ గురుకులం మూసివేతపై బి.వై.ఎఫ్- బీఎస్పీ ఫైర్
🔵వెంటనే పునఃప్రారంభించాలి లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం ప్రభుత్వానికి బీఎస్పీ హెచ్చరిక కోట స్వర్ణసాగరం, జూలై 24: కోట మండలంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల మూసివేతను నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నెల్లూరు జిల్లా కమిటీ నాయకులు,బహుజన యూత్ ఫోర్స్ నాయకులతో కలిసి శుక్రవారం పాఠశాలను సందర్శించి తీవ్ర నిరసన తెలిపారు.దళిత,బహుజన విద్యార్థుల విద్యా హక్కులను కాలరాసే చర్యగా ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించారు.అనంతరం కోటలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన నాయకులు,వెంటనే గురుకుల పాఠశాలను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం నిర్ణయాన్ని...