కొత్తపాళెం ఉన్నత పాఠశాలలో ఘనంగా మెగా పీటీఎం 4.0 కార్యక్రమం

టీడీపీ నేత నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తల్లిదండ్రులు– ఉపాధ్యాయుల సమావేశం విజయవంతం కోట స్వర్ణసాగరం, జూలై 24: కోట మండలం నెల్లూరుపల్లి కొత్తపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెగా పీటీఎం 4.0 కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు నెల్లూరు మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు,విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నెల్లూరు మోహన్ రెడ్డి మాట్లాడుతూ,విద్యార్థుల భవిష్యత్ నిర్మాణంలో తల్లిదండ్రులు,ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం...