💥ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో తిన్నెలపూడి
💥టీడీపీ ఇంటింటి ప్రచారానికి విశేష స్పందన – గ్రామాభివృద్ధిపై ప్రజల హర్షం
కోట స్వర్ణసాగరం జులై 31
గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు గండవరం సుష్మారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఇంటింటి ప్రచార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ నేపథ్యంలో గండవరం సుష్మారెడ్డి కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో అమలు చేస్తున్న సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ నాయకత్వంలో తిన్నెలపూడిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని,ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని ప్రశంసించారు.అలాగే తన తండ్రి స్వర్గీయ గండవరం రవీంద్రరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధికి కృషి చేస్తున్న గండవరం సుష్మా రెడ్డిపై గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.తండ్రికి తగ్గ తనయురాలిగా గ్రామాభివృద్ధిని తన బాధ్యతగా భావించి ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్నారని కొనియాడారు.ఈ సందర్భంగా గండవరం సుష్మా రెడ్డి మాట్లాడుతూ,ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ సహకారంతో తిన్నెలపూడి గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ప్రతి కుటుంబానికి చేరువై గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కొండూరు కోటయ్య,కొండూరు వెంకటేశ్వర్లు,నులక హరినాద్,నులక మస్తాన్, కొండూరు మనోహర్,మారుబోయిన గోవిందయ్య,మారుబోయిన సాయి,నులక చైతన్య,రౌతు కోటేశ్వరరావు,పుచలపల్లి రామయ్య,టీడీపీ కార్యకర్తలు,గండవరం రవీంద్ర రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.